ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలి

ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపండి
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించ వచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ముసాయిదా జాబితాలను స్థానిక గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ఈ నెల 13 న ముసాయిదా జాబితా ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలపై అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21 లోగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి లకు అందజేయాలని తెలిపారు. అట్టి అభ్యంతరాలను పరిశీలించి ఈ నెల 26 లోగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తుది ఫోటో ఎలెక్టోరల్ జాబితాను ఈ నెల 28 న ఆయా గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జాబితా సాఫ్ట్ కాపీ లను రాజకీయ పార్టీలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now