ఇప్పట్లో అక్రీడిటేషన్ లు లేనట్టే
స్టిక్కర్లతో జర్నలిస్టులకు అన్యాయం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 30
తెలంగాణలో ఫీల్డ్ జర్నలిస్టులకు రెండేళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన ఆక్రిడిటేషన్ కార్డుల జారీ మూడు సంవత్సరాలుగా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా మూడు నెలల స్టిక్కర్లతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తోంది.
కొత్తగా వచ్చిన జర్నలిస్టులు, ఇంకా అక్రీడిటేషన్ కార్డు రాని వారు అధికారిక కార్యక్రమాలకు దూరమవుతున్నారు. హెల్త్ కార్డులు, గుర్తింపు, ప్రభుత్వ సమాచారం లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కార్డుల జారీ సమయంలో జరిగిన అవకతవకలు ఇంకా పరిష్కారమవ్వలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త అక్రిడిటేషన్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు డి.ఎల్.యన్.చారి డిమాండ్ చేశారు. యూనియన్లు మేలుకొని జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించారు.