Site icon PRASHNA AYUDHAM

నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన త్రాగునీటి మానిటరింగ్ సెల్ కు ఫోన్ చేసి సమస్య వివరించాలి

IMG 20250324 WA0097

గ్రామీణ, పట్టణ ప్రాంతంలో త్రాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన త్రాగునీటి మానిటరింగ్ సెల్ కు ఫోన్ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తినపుడు కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన మానిటరింగ్ సెల్ నెంబర్ 9908712421 కు కాల్ చేసి తెలియజేయవచ్చునని తెలిపారు. ఈ మానిటరింగ్ సెల్ ప్రతీ రోజు ఉదయం గం.10-30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని, అట్టి సెల్ ద్వారా త్రాగు నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చుని తెలిపారు. సమస్యకు సంబంధించిన వివరాలును నమోదు చేసుకొని సంబంధిత పంచాయతీ, మిషన్ భగీరథ అధికారులకు,సిబ్బందికి తెలియపరచి సమస్యను పరిస్కరించబడుతుందని పేర్కొన్నారు. అట్టి సెల్ ను కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించి తగు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version