కోపం ఉంటే మాపై చూపాలి ప్రజల మీద కాదు

*ముఖ్యమంత్రి కి కోపం ఉంటే మాపై చూపాలి ప్రజల మీద కాదు రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు*

 

*దున్నపోతుపై వర్షం పడితే ఉన్నట్లు ఉంది ప్రభుత్వ పరిస్థితి*

 

*పథకం పేరు మార్చిన పరవాలేదు కేసీఆర్ కిట్, కంటి వెలుగు అమలు చెయ్యండి*

 

*హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

 

*హుజురాబాద్ అక్టోబర్ 15 (ప్రశ్న ఆయుధం)*

 

ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం నిత్యం వందలమంది వస్తుంటారని వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు,సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని ముఖ్యమంత్రికి కోపం ఉంటే మాపై చూపాలి ప్రజల మీద కాదు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖి చేసి అనంతరం డాక్టర్లు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గర్భిణీల పట్ల సోమవారం డాక్టర్లు డెలివరీ నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఆరోగ్యం కోసమే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఉంటుందని, ఒక్క రోగి కూడా ఆస్పత్రిలో ఇబ్బంది పడకూడదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పూర్తిస్థాయిలో అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో చికిత్స అందడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందని కెసిఆర్ హయాంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు 200లకు పైగా డెలివరీలు జరిగేవని ప్రస్తుతం ఆస్థాయి గణనీయంగా పడిపోయిందని గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రి పై ఒత్తిడి తీసుకురావడంతో డెలివరీల సంఖ్య వందకు పెరిగాయని భవిష్యత్తులో వీటిని 200 పెంచాలని డాక్టర్లకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం ఉంటే కెసిఆర్, బీఆర్ఎస్ నాయకుల మీద తీర్చుకోవాలి తప్పా పేద ప్రజల పైన కాదని హుజురాబాద్, జమ్మికుంట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతగా ఉందని వెంటనే పూర్తిస్థాయిలో సిబ్బందిని నింపాలని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక గైనకాలజిస్ట్ తో పాటు అనస్తిష్టును వెంటనే కేటాయించాలని, అలాగే జమ్మికుంట కూడా గైనకాలజిస్ట్ను నియమించాలని గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ తో పాటు డెలివరీ అయిన తర్వాత కెసిఆర్ కిట్ ని కూడా అందించాలని కెసిఆర్ కిట్ కి పేరును మార్చిన పరవాలేదని, గర్భిణీ స్త్రీలకు గతంలో మాదిరిగానే ఆడపిల్ల పుడితే 13000 మగ బిడ్డ పుడితే 12000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా తిరిగి చేపట్టాలని డాక్టర్లపై తమకు గౌరవం ఉందని ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని కోరారు ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే వెంట అడిషనల్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ చందూలాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారెడ్డి, ఆర్ ఏం ఓ సుధాకర్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now