Site icon PRASHNA AYUDHAM

అలుపు లేని తలపులకు  గడప దాటు స్వేచ్ఛ ఇస్తే..

IMG 20250203 WA0087

అలుపు లేని తలపులకు

గడప దాటు స్వేచ్ఛ ఇస్తే..

మరలిపోయిన వసంతాలను

తిరిగి పొందే సమయమొస్తే…

అనుక్షణము ఆలాపనలై

అనుదినము అపురూపమై

అన్యమెరుగక ఆనందాలను

అందుకునే వరమిస్తే…

అవనిలోని అందాలన్నీ

అణువణువూ ఆస్వాదించి

అనుపమాన అద్వైతంలో

అంతరంగం కలిసిపోదా!

అంతులేని అన్వేషణగా

అదేపనిగా వెదుకుతున్న

ఆప్తబంధం అల్లుకుని

అరమరికలు లేక కరిగిపోదా!

అమ్మ ఒడిలో ఆడుకుంటూ

ఆప్యాయత చవిచుస్తూ

ఆ అనురాగభరితమైన

ఆలింగనంలో ఆత్మానందం పొందదా!

ఊహలన్ని ఊసులై

ఊయలూపి ఉత్సాహం నింప

ఉదయానికై ఉరకలేస్తూ

వేచి చూచు హృదయాలకు

Exit mobile version