మన మాతృభాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు…

*హైదరాబాద్:*

తెలుగు భాషకు మనమంతా వారసులమని.. దానిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

మన మాతృభాషను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారని ఆయన ప్రశ్నించారు.

మాతృభాషలో మాట్లాడడం అందరికీ అలవాటుగా మారాలన్నారు.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు.

తన ఉన్నతికి తెలుగు వెలుగే కారణమన్నారు.

దేశంలో గొప్ప పదవుల్లో ఉన్నవారంతా మాతృభాషలో చదువుకున్నవారేనని చెప్పారు.

Join WhatsApp

Join Now