ఆడపిల్లనని నీకు బరువైననా? అమ్మ…
కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) జూలై 11
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద దేవడ గ్రామ శివారులోని బిచ్కుంద నుండి బాన్సువాడ వెళ్ళే రోడ్డు బ్రిడ్జి వద్ద అప్పుడే పుట్టిన ఆడపిల్ల(నవజాత శిశువు) ను పక్కన మాయతో పడవేయగా అటుగా వెళ్ళిన వారు బిచ్కుంద పోలీస్ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే పుల్కల్ పీహెచ్ కి తరలించి ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వెంటనే ఈ సమాచారం అంగన్వాడి సిడిపిఓ కి చెప్పి బేబీ సంరక్షణ అర్థం వారికి అప్పగించడం జరిగిందని అన్నారు.