Site icon PRASHNA AYUDHAM

ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది

IMG 20250805 WA1879

ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది. మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నా. భువనగిరి ఎంపీ స్థానం గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. నా స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లేదు’’అని అన్నారు.

Exit mobile version