ప్రభుత్వ పాఠశాలలో చదివితే మంచిభవిష్యత్తు వుంటుంది : సుభాష్
ప్రశ్న ఆయుధం జూన్10: శేరిలింగంపల్లి ప్రతినిధి
చందానగర్ డివిజన్, గంగారంలోని ఎమ్ పీ పీ ఎస్. పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో బాగంగా ఐదవరోజు 2025-2026 సంవత్సరానికి గాను విద్యార్ధుల నమోదు కార్యక్రమం నిర్విహించారు. ఈ సందర్బంగ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతు, ప్రభుత్వ పాఠశాలలలో చదివితే మంచి భవిష్యత్తు వుంటుందని గురుకుల పాఠశాల, నవోదయ, పాఠశాలలో 80శాతం సీట్లు ఉంటాయని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆటలు, పాటలు, వ్యాసరచన పోటీలు నిర్విహించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని వివరించారు. విద్యార్ధులకు రెండు జతల బట్టలు, బెల్ట్, బ్యాడ్జ్ లు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యం. సుభాష్ , ఏ ఏ పీ సీ. కమిటీ చైర్మన్ భీమమ్మ, పేరెంట్స్ కమిటీ చైర్మన్.యం. నరహరి, ఉపాద్యాయులు విజయలక్ష్మి ,టీ ప్రీతి , సీ. కృష్ణ వేణి ,పాఠశాల దాత దేవానంద్, విద్యార్ధుల తల్లితండ్రులు పాల్గొన్నారు.