సంగారెడ్డి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇష్టా జూనియర్ కళాశాలలో ఐఐటీ చుక్కా రామయ్య 100వ జన్మదిన వేడుకలు కన్నుల పండుగలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ వినోద్‌కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఇబ్రహీం, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ చుక్కా రామయ్య శత జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన విద్యా రంగంలో చేసిన సేవలను స్మరించారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించడమే ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రామయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం కళాశాల బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చుక్కా రామయ్య జీవిత విశేషాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. కార్యక్రమం చివరగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇష్టా జూనియర్ కళాశాలలో ఘనంగా ఐఐటీ చుక్కా రామయ్య జన్మదిన వేడుకలు
Published On: November 20, 2025 7:25 pm