పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఇల్లందకుంట బిజెపి శ్రేణులు 

పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఇల్లందకుంట బిజెపి శ్రేణులు

మహేష్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం

జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 25 ప్రశ్న ఆయుధం

బిజెపి పార్టీపై , కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఇల్లందకుంట బిజెపి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు భగ్గుమన్నారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలను నిరసిస్తూ, ఖండిస్తూ సోమవారం రోజున ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు అనంతరం బిజెపి మండలాధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మతిభ్రమించినట్లు ఉందని బిజెపిపై, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను మండల శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఓట్ చోరీతో బిజెపి గెలిస్తే, కాంగ్రెస్ కూడా ఓట్ చోరీతో గెలిచిందా అనే విషయంపై మహేష్ గౌడ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహేష్ గౌడ్ వి దిమాక్ లేని మాటలని , ఓట్ చోరీ జరిగితే తెలంగాణలోబీజేపీ 8 పార్లమెంట్ సీట్లు ఎందుకు వస్తాయి..?అని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం, హిందుత్వం కోసం , దేశం కోసం , దేవుళ్ళ కోసం బిజెపి ఆలోచన చేస్తుందని కొట్లాడుతుందని వీటి కోసం బీజేపీ పని చేయడం తప్ప…? బిజెపి గురించి దేశ ప్రజలకు అర్థమైంది కాబట్టి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ గురించి ప్రజలకు అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ అడ్రస్సును ప్రజలు దేశవ్యాప్తంగా గల్లంతు చేశారన్నారు. ఆరూ గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మోసం ప్రజలకు అర్థమైందని, ప్రజలు కాంగ్రెస్ పై తిరగబడే స్థితులు నేడు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత యాత్ర పేరిట కాంగ్రెస్ దొంగ నాటకాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. యాత్రలో కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలకు చేసిన మేలు ఏది లేక ,బిజెపిపై అనవసర వ్యాఖ్యలు చేస్తుందని ముఖ్యంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గెలుపు పై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆపేక్షనీయమని కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖ అభివృద్ధి కోసం కృషి చేస్తూ, వేలకోట్ల నిధులతో కరీంనగర్ పార్లమెంటు ముఖచిత్రాన్ని బండి సంజయ్ కుమార్ మారుస్తున్నారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ ప్రజల ఆశీస్సులు బండి సంజయ్ కి ఉండడంతోనే రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారని తెలిపారు. అలాంటి గెలుపును , కరీంనగర్ పార్లమెంట్ ప్రజల తీర్పును అపహస్యం చేసే విధంగా మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. మహేష్ గౌడ్ వెంటనే కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, ఆరెల్లి శ్రీనివాస్,కొత్త శ్రీనివాస్, కంకణాల రవీందర్ రెడ్డి,అబ్బిడి తిరుపతి రెడ్డి, ఎండీ షఫీ, నల్ల లింగారెడ్డి, మట్ట పవన్ రెడ్డి,తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, పలకల కిషన్ రెడ్డి, వలసాని సునీల్, కూకట్ల రాజిరెడ్డి, గురుకుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య, జంగం సమ్మయ్య, చిట్ల శ్రీనివాస్, విజయగిరి శ్రీనివాస్, గుడికందుల రమేష్,కోడం భరత్, మేకల మురళి, శానబోయిన శ్రీనివాస్, మాదాసు మొగిలి, రాధారపు ఐలయ్య తదితరులతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment