బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

* మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్

*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 26, ప్రశ్న ఆయుధం

బిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టుచేయడం అప్రజాస్వామికమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం ఎటువంటి నోటీసుల జారీ చేయకుండా ఇంట్లోకి చొరబడి బలవంతంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరమ్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొండపాక్ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, సర్పంచ్ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు చంద్ర మోహన్ రెడ్డిలతో కలిసి అరెస్ట్ను ఖండిస్తూ మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బిఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్న ఆయనపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన బాద్యత ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్గా చురుకైన పాత్ర పోషించారని అన్నారు. కేవలము చెత్త కాగితాలకే పరిమితమైన కమీషన్ ను ఎటువంటి ఫిర్యాదులు పరిష్కారం లేకుండా కుప్పలుగా ఉన్న అన్ని సమస్యలును పరిష్కరించి ఎస్సీ ఎస్టీ కమీషన్ పట్ల భరోసా, నమ్మకం కలిగించిన నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ అని గుర్తు చేశారు. అదే విదంగా వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో, హరీష్ రావు నాయకత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో కీలకంగా పని చేసి గణనీయంగా మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. బిఆర్ఎస్ అధినేత ఏ పిలుపు ఇచ్చిన అటు ఉద్యమంలో అటు గత కేసీఆర్ ప్రభుత్వంలో నేడు ప్రతిపక్షములో నిరంతరం ప్రజా ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తి ఎర్రోళ్ల అని అన్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్న ప్రతి ఒక్కరిపై ఏదో విదంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అనడానికి సాక్ష్యం ఈ అక్రమ అరెస్టులేనని తెలిపారు. ప్రజా పాలనలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి అమలుచేస్తున్నారని అన్నారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి అణచివేతతో బిఆర్ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారని అన్నారు. రోజురోజుకూ కాంగ్రెస్ పై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేఖాతాను ఎలా ఆపాలో తెలియక ప్రధాన ప్రతిపక్షాన్ని బిఆర్ఎస్ నాయకులపై సర్వశక్తులు ఒడ్డుతున్నారని అన్నారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతి కాంగ్రెస్ తీసుకొస్తుందని మండి పడ్డారు. బిఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదని, అరెస్టులు అంత కన్నా కాదని, ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, సంతోష్ రెడ్డి, నాయకులు ఉమర్, బైరం శివకుమార్, మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment