మాజీ మంత్రి హరీష్ రావుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

*మాజీ మంత్రి హరీష్ రావుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి*

*అక్రమ కేసులని ఖండించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్.పల్లా రాజేశ్వర్ రెడ్డి*

*చేర్యాల ప్రశ్న ఆయుధం ప్రతినిధి*

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గమాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీష్ రావు పై పోలీసులు అక్రమ కేసు పెట్టడం అప్రజాస్వామికం అని మంగళవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి

ఏడాది కాలం పూర్తి అయినా క్రమంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయలేకపోయాడని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న హరీశ్‌రావుపై కావాలనే కేసు నమోదు చేశారన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్‌ పరిపాలనలో అకృత్యాలు నిత్య కృత్యమయ్యాయని, రేవంత్ సర్కారు కేసులకు, బెదిరింపులకు బీఆర్ ఎస్ నాయకులెవరూ భయపడ రన్నారు. పది, పదిహేనేళ్లు ప్రజా క్షేత్రంలో ఉంటూ పోరాడిన చరిత్ర బీఆర్ ఎస్ దని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. హరీష్ రావు కాలిగోటికి సరిపోని వ్యక్తి.. సిద్దిపేటకు చెందిన చోటామోటా కాంగ్రెస్ నాయకుడితో ప్రభుత్వం అక్రమ కేసు పెట్టించిందని, కేసులు, పోరాటాలు బీఆర్ ఎస్ నాయకులకు కొత్తకాదని, ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment