శంషాబాద్ లో ఆకాశానంటుతున్న అక్రమ నిర్మాణ కట్టడాలు.
పట్టించుకోని అధికారులు
సామాన్యులు ఒక్క అంతస్తు నిర్మాణం నిర్మించుకుంటే ముప్పు తిప్పలు పెట్టే అధికారులు మరోవైపు ఆకాశాన్ని అంటుతున్న అక్రమ కట్టడాల వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం పట్ల శంషాబాద్ పట్టణవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న. 111 జీవోలో అక్రమ కట్టడాలకు ఏమాత్రం భయం లేకుండా బహులాంతస్తులు నిర్మాణాలను నిర్మిస్తున్నారు. అధికారులు అక్రమార్కులపై కొరడా జూలిపించకపోతే శంషాబాద్ నగరం ప్రమాద అంచుకు చేరడం ఖాయమని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారులు వెంటనే అక్రమ కట్టడాలను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు