మండలంలో అక్రమ నిలువలు ఇసుక నిల్వలు !

వందల కొద్ది మెట్రిక్ ఇసుక నిల్వల పై నియంత్రణ శూన్యం ? ముడుపులకు బానిసై విధి నిర్వహణ మందగిస్తున్న యంత్రాంగం సమాచారం ఇచ్చిన స్పందించని రెవెన్యూ శాఖ.. పదుల సంఖ్యలో భారీ వాహనాల ద్వారా ఇసక తరలింపుఅయ్యా జిల్లా కలెక్టర్ కి అధికార యంత్రాంగం వైపు చూడరు.ములకలపల్లి అక్రమ ఇసుక రవాణాపై వింత ఘటన ములకలపల్లి (ప్రశ్నఆయుధం)  జనవరి 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండలంలో పూసగూడెం సీతారాంపురం గుర్రాలగుంట గ్రామ సమీపంలో కొందరు బడా బాబులు అక్రమ ఇసుక వందలకొద్దీ మెట్రిక్ టన్నులను నిల్వలు చేసి రహస్యంగా భారీ వాహనాల ద్వారా పట్టణాలకు తరలించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి పట్టణంలోని అందరు వ్యక్తులు అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇసుక నిల్వల ప్రదేశాల నుండి పట్టణం బోర్డర్ సమీపం వరకు వివిధ ప్రదేశాలలో కొందరు అపరిచితులు వ్యక్తులను కాపలాదారులుగా నియమించి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ పదుల సంఖ్యలో లారీలను తరలిస్తున్నారు. ఇటువంటి విషయాలను స్థానిక రెవెన్యూ అధికారులకు గానీ పోలీస్ శాఖకు గానీ సమాచారం ఇచ్చినప్పటికీ అతి సులువుగా వాహనాలను బయటకు తరలించడం జరుగుతుందని పట్టణం వాసులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇసుక మాఫియాలో కొందరు పట్టణంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు రకరకాల బహుమతులు మరియు ఇంటి సామాగ్రితో పాటు తినుబండారాలు అలాగే వాహనాలకు టైర్లు క్యూబ్ లో కాకుండా చరవాణీలను సైతం బహుమతులుగా ఇవ్వటం మండలంలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి బుధవారం నాడు అనేక చోట్ల ఇసుక నిల్వలు కనిపించగా మండల అధికారులకు సమాచారం ఇవ్వడం వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం కొసమెరుపు ఈ ఇసుక దందా వెనక ఓ కథానాయకుడు పర్యవేక్షణలో కొనసాగుతున్నట్లు సమాచారం రాత్రి సమయంలోనే యథేచ్చగా ఇసుక అక్రమ నిలవలు జరుగుతున్నాయని రోజుకి 50 నుంచి 60 లారీల వరకు లోడింగ్ చేయడం జరుగుతుందని ఇటువంటి వాటిని సీతారాంపురం పంచాయతీలోని వివిధ గ్రామాలకు చెందిన ఇసుక ట్రాక్టర్ల యజమానులు మాఫియా ముఠాగా ఏర్పడి మండల పరిధిలోని గుర్రాలకుంట వాగు నుండి ఇసుక తోడేస్తున్నారని మండలంలో భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ఇసుక మాఫియాకు ఓ అధికార పార్టీ నాయకులు అన్నదండ ఉండటం కార్యక్రమాలకు వారు సహకారాలు అందించడం జరుగుతుందని తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ములకలపల్లి మండలంలోని పూసుగూడెం సీతారాంపురం గుర్రాలగుంట వంటి గ్రామాలలో జరుగుతున్న ఇసుక మాఫియా పై నిగా పెట్టాలని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ములకలపల్లి పట్టణం వాసులు కోరుకుంటున్నారు.ఇట్టి విషయంపై స్థానిక రెవెన్యూ అధికారి ఎమ్మార్వో పుల్లారావును చరవాణి ద్వారా సమాచారం కోరగా పట్టణంలోని పలు గ్రామాలలో అక్రమ ఇసుక నిలువలు ఉండటం యదార్థం అని సంఘటనా స్థలానికి గిరిధర్ .1 ను పంపించడం జరిగిందని. తదుపరి పై చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు . ఇకపై కేసు నమోదు చేస్తామని తెలపడం జరిగింది.

Join WhatsApp

Join Now