అక్రమ మొరం మాఫియా అరికట్టాలి.
ఎత్తోండ రైతులు డిమాండ్.
కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామం గౌతమ్ నగర్ కాలనీ ప్రక్కన ఉన్న గుట్టలో గత 4 రోజులుగా రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకి వెళ్లే దారులు తవ్వేసి రైతులకు ఇబ్బంది పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. అక్రమ మొరం మాఫియాదారులు అమ్మకాలు చేపడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులు మొరం మాఫియాను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొరం మాఫియాను అరికట్టని ఎడల రెవిన్యూ పోలీస్ కార్యాలయాలకు ముట్టడిస్తామని హెచ్చరించారు.