వాహనంలో గోవుల అక్రమ తరలింపు

వాహనంలో గోవుల అక్రమ తరలింపు

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం ) డిసెంబర్ 30

నిజామాబాద్ వైపు నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని భిక్కనూరు టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సోమవారం నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం టోల్ ప్లాజా వద్ద నిలపగా, వాహనంలో సుమారు 25 నుంచి 30 గోవులు ఉండడంతో అడ్డుకున్నారు. అయినా డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లగా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు డీసీఎంను వెంబడించి మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివనూర్ సమీపంలో పట్టుకున్నారు. వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. దీంతో వాహనాన్ని జంగంపల్లి గోశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఆవుల తరలింపును అడ్డుకున్న టోల్ ప్లాజా సిబ్బందిని మండల హిందూ సేవాదళ్ సమితి సభ్యులు అభినందించారు.

Join WhatsApp

Join Now