అర్ధరాత్రి అక్రమ మట్టి దందా !

అర్ధరాత్రి అక్రమ మట్టి దందా !

100 కి సమాచారం ఇచ్చిన కట్టడి శూన్యం..!

మట్టి మాఫియా తో అధికారులు లాలూచీలు అంటూ ప్రచారం..?

నాయకులు పేర్లు చెప్పి దందగిరిలు..

కంచే చేను మేసిందన్నట్లు యంత్రాంగమా !

అర్ధరాత్రి రవాణా వల్ల నిద్రపోని గ్రామస్తులు

ప్రభుత్వాలు మారిన ప్రజలకు తప్పని తిప్పలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని కొందరు అర్ధరాత్రి అక్రమ మట్టి దందా కొనసాగిస్తునా సందర్భంలో అధికారులకు సమాచారం ఇచ్చిన ఫలితం మాత్రం శూన్యమేనని తెలుస్తుంది. పట్టణంలో ఉన్న కొందరు నాయకులతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారాలు సాగిస్తున్న సందర్భంలో కొందరు అధికారులు సైతం తప్పును ఖండించలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.దీనివల్ల అర్ధరాత్రి మట్టి రవాణా వల్ల గ్రామాలలో ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదని వాదనలు వినిపిస్తున్నాయి. అశ్వరావుపేట పట్టణంలోని పేరాయి గూడెం పంచాయతీ పరిధిలోని 1228 సర్వే నెంబర్లు ప్రభుత్వం భూములు. ఇటువంటి వాటిలో మంగళవారం అర్ధరాత్రి 11 గంటల సమయం నుండి గ్రామానికి అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలను యదేచ్ఛగా జరిపించి దంధాలను కొనసాగిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో నియోజకవర్గం ప్రధాన నాయకుల పేర్లు చెబుతూ మాకు పరిచయస్తులు ! మా మాట వినాల్సిందే ! మేము ఏది చెప్పినా అదే శాసనం ? మాకు ఎదురేలేదు. అంటూ ప్రచారాలు నిర్వహిస్తున్న సందర్భంలో సంబంధిత అధికారులు సైతం వారిని కట్టడి చేయలేని పరిస్థితి దీనివల్ల ఆ అధికారికి తమ ఉద్యోగ రీత్యా ఇబ్బందులు గురి అయ్యే అవకాశం ఉందని చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి బుధవారం నాడు కనిపించింది. ఇటువంటి వాటికోసం మట్టి మాఫియా లీడర్లు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఫలానా కార్యకర్త అని గుర్తింపు పొందిన పిమ్మట ఇసుక దందాలు. మట్టి దందాలను ప్రారంభించి యదేచ్చగా కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇటువంటి పట్టణానికి చెందిన కొందరు మట్టి మాఫియా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని ప్రభుత్వ చరవాణి 100. కీ సమాచారం ఇచ్చినప్పటికీ అధికారి యంత్రాంగం స్పందించడం జరిగింది కానీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వారితో ఒప్పందాలను కుదుర్చుకొని రవాణా జరుపుతున్న ట్రాక్టర్లు గాని జెసిపిని గాని కస్టడీలోకి తీసుకోలేదన్నట్లు తెలుస్తుంది. ఇటువంటి సంఘటన జరిగిన మరికొన్ని గంటలలో అట్టి మట్టి మాఫియా లీడర్లు యదేచ్చగా బుధవారం రాత్రి మట్టి తవ్వకాలు జరిపిస్తున్న తీరును గ్రామంలో అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేసింది ప్రభుత్వ సమాచార 100. చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడం స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికారుల స్పందించటం సంఘటనా స్థలానికి అధికారులు చేరుకోవడం ఓ అర్థగంట మట్టి రవాణాకు విరామం జరగటం తదుపరి మరలా కొనసాగించడం ఇటువంటి సన్నివేశాలను యావత్తు గ్రామంలో కుదిపేస్తుంది పోలీస్ స్టేషన్లో తప్పును తప్పుగా చెప్పటం గాని నేరానికి సాక్ష్యం కాబటం గాని రెండు నేరం కిందే ఉంటుందని మంగళవారం రాత్రి జరిగిన సంఘటన పేరాయి గూడెం గ్రామస్తుల్లో ఆలోచింపజేసింది ఏది ఏమైనా సామాన్యుడు చిన్న తప్పు చేస్తే పదేపదే పోలీస్ స్టేషన్ కి రావాలంటూ అధికారులు చరవాణి ద్వారా సమాచారం ఇస్తూ అనేక ఇబ్బందులను గురిచేస్తున్న యంత్రాంగం అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలు జరిపే సమయంలో సమాచార ఇచ్చిన అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు. వారు చేసేది తప్పు కాదా ! ఇటువంటి వారికి అధికారులు సహకరిస్తున్నారా ! ఇంత తప్పుడు పనులు చేస్తుంటే సమాచారం కస్టడీలోకి తీసుకోలేదు తెలియని పరిస్థితి అంతేకాకుండా అధికారులు విధుల్లో భాగంగా సంఘటనా స్థలానికి చేరుకొని వారితో లాలూచీపడి వాహనాల లేని ప్రదేశాన్ని చిత్రికించి అటువంటి దృశ్యాన్ని ఫిర్యాదు చేసిన వారికి సమాచారం ఇవ్వటం సర్వసాధారణమైంది. పగలు మట్టి రవాణా జరిపితే ఆ నోట ఈ నోట తెలిసి మీడియా కథనాలు ప్రచురిస్తారని గ్రహించిన మట్టి మాఫియా లీడర్లు అర్ధరాత్రి సమయం నందు అక్రమ మట్టి దందా కొనసాగించుటకు ప్రయత్నిస్తున్నారని గ్రామంలో భారీ ప్రచారాలు కొనసాగుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి రాత్రి సమయంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై పిడి యాక్ట్ నమోదు చేసే విధంగా కార్యచరణ రూపకల్పన చేయాలని అలాగే మాఫియాకు సహకరిస్తున్న అధికారుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుకుంటున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment