అక్రమ రేషన్ బియ్యం రవాణా ఇద్దరు అరెస్ట్.

_అక్రమ రేషన్ బియ్యం రవాణా  ఇద్దరు అరెస్ట్

_బొలెరో వాహనంతో తరలిస్తుండగా గాంధారి ఎస్ఐ ఆకస్మిక తనిఖీ

_అక్రమ రవాణా పాల్పడితే  కఠిన చర్యలు తప్పవు.

గాంధారి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో అక్రమ రేషన్ బియ్యం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. గౌరవరం గ్రామంలో బొలెరో వాహనంలో 32 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను   ఎస్ఐ బి.ఆంజనేయులు అరెస్ట్ చేశారు.కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ డ్రైవింగ్ చేస్తున్న బొలెరో వాహనం (TS 16UB 4583) ను తనిఖీ చేస్తే, అందులో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది.

తాడ్కోల్ గ్రామానికి చెందిన అందె మనోహర్ ఈ బియ్యాన్ని వివిధ గ్రామాల నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.బియ్యం, రవాణా వాహనాన్ని పోలీస్ స్టేషన్‌ కు తరలించి కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులకు అప్పగించారు.

అక్రమ రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలో అసాంఘిక చర్యలపై కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment