పుట్ట గొడుగుల్లా అక్రమ, నిర్మాణాలు..!

పుట్ట గొడుగుల్లా అక్రమ,అనుమతులు లేని నిర్మాణాలు

టౌన్ ప్లానింగ్ అధికారిపై ప్రజావాణిలో ఫిర్యాదు

సెట్ బ్యాక్ తీసుకోకుండా వందల నిర్మాణాలు 

ప్రభుత్వ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి

ఫిర్యాదు కు స్వీకరించి విచారణ కు ఆదేశించిన అదనపు కలెక్టర్

హుజరాబాద్ ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం

హుజురాబాద్ పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారి పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే కి ఫిర్యాదు చేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్ తెలిపారు అనంతరం సూర్య కిరణ్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా తమ ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా సెట్ బ్యాక్ తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని కొన్ని నిర్మాణాలు పురపాలక సంఘం నుండి అనుమతులు పొందిన నిర్ణీత స్థలంలో కాకుండా కొద్ది స్థలానికి అనుమతులు పొంది తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని గడిచిన సంవత్సర కాలంగా యదేచ్చగా పుట్ట గొడుగుల్లా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు అని ఇట్టి విషయమై పురపాలక సంఘం హుజరాబాద్ కమిషనర్ కి సైతం ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని మున్సిపల్ అధికారుల తీరు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోంది తెలిపారు ఈ క్రమంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా తప్పకుండా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఈ విషయం పై విచారణ జరపాలని మున్సిపల్ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు టౌన్ ప్లానింగ్ అధికారి పై చర్యలు తీసుకునేంత వరకు ఉన్నత అధికారులకు సంబంధిత మంత్రి కి ఫిర్యాదు చేస్తూనే ఉంటానని తెలిపారు.

Join WhatsApp

Join Now