బూర్గంపాడు, నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, సారపాక ప్రాంతాలలో పగలు రాత్రి తేడా లేకుండా ఉచ్చలవిడిగా ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా.
నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, సారపాక గోదావరి బ్రిడ్జి కింద, తాళ్ల గొమ్మూరు లో రెవెన్యూ వారు జెసిబి లతో ట్రంచులు కొట్టించిన ఫలితం శూన్యం.
రెవెన్యూ వారు కొట్టించిన ట్రంచులను పూడ్చి అక్రమ ఇసుక రవాణాను యదేచ్చగా నడుపుతున్నకొందరు వ్యక్తులు.
2500 నుండి 3000 వరకు ఇసుకను అమ్ముతూ , ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న కొందరు ఇసుక అక్రమార్కులు..
పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ మండల రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల సర్వత్ర విమర్శలువెలువెత్తుతున్న వైనం.