అక్రమ ఇసుక రవాణా

*అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు- ఎస్ఐ రాజ్ కుమార్*

 

 *ఇల్లందకుంట అక్టోబర్ 17 (ప్రశ్న ఆయుధం)*

 

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గురువారం రోజు ఉదయం ఏడు గంటలకు ఇల్లందకుంట మండలంలోని కనగత్తి గ్రామ శివారులో నరెడ్ల సన్నీ బిట్లు అశోక్ అను వారి ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని అలాగే టేకుర్తి గ్రామ శివారులో కుక్కల రాజకుమార్ కుక్కల రమేష్ బిట్ల అంజి అను వారు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందున వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారందరూ కూడా జమ్మికుంట మండలం విల్లాసాగర్ గ్రామానికి చెందిన వారిని ఎస్సై తెలిపారు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని ఎస్సై రాజకుమార్ తెలిపారు

Join WhatsApp

Join Now