*పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక*
దేశంలోని రాష్ట్రాలు/యుటిలకు ఐఎండీ వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లలో సోమవారం చలిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం యూపీ, బీహార్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో, మంగళవారం బీహార్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో గురువారం నాడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.