ఆర్ యం పి చేసిన వైద్యం వికటించి చనిపోయిన అమ్మాయి పట్ల వారే బాధ్యత వహించాలి.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ప్రజాపంధా పార్టీ చూస్తూ ఊరుకోదు.
(డి యం అండ్ హెచ్ ఓ) స్పందించి సంబంధిత ఆర్ యం పి పై చట్టపర కఠినమైన చర్యలు చేపట్టాలి.
(డి యం అండ్ హెచ్ ఓ) ఆర్ యం పి ల కేంద్రాలను తక్షణ తనిఖీలు చేపట్టాలి.
సి పి ఐ యం ఎల్ మాస్ లైన్ (ప్రజాపంధా)పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండా చరణ్ డిమాండ్..
చర్ల మండల కేంద్రంలోని కామ్రేడ్ డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండా చరణ్ పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో కొందరు ఆర్ఎంపీలు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారని ఆ వైద్యం కాస్త వికటించి ప్రజలు నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి నిలువెత్తు నిదర్శనం రెండు రోజుల క్రితం ఒక అమ్మాయి చర్ల లో ఒక ఆర్ యం పి కేంద్రంలో మరణించడమే అని గుర్తు చేశారు.ఇటీవల కాలంలో పాల్వంచ ప్రాంతంలో ఐదేళ్ల పసివాడు వైద్యం నిమిత్తం స్థానిక ఆర్ఎంపీని ఆశ్రయించగా ఆ పసివాడికి వైద్యం వికటించి శరీరం మొత్తం రక్తపు బొగ్గలు వచ్చి నరకం అనుభవించి చనిపోయిన విషయం నిజం కాదఅని గుర్తు చేశారు.దీనికి కారణం ఆర్ యం పి వైద్యం కాదా అని ప్రశ్నించారు.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై ఈ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజ నిజాలు నిర్ధారించి చర్యలు చేపట్టాలని తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యను అనేకసార్లు లేవనెత్తినప్పటికీ ఈ ప్రాంత డి ఎం అండ్ హెచ్ ఓ ఆర్ఎంపీల కేంద్రాలను ఎందుకు తనిఖీలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొందరు ఆర్ఎంపీలపై చట్టరిత్య చర్యలు చేపట్టాలని ఆయన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిఎడల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఐక్యం చేసి ప్రజల ప్రాణాలను కాపడుకోవడం కోసం సి పి ఐ యం ఎల్ మాస్ లైన్ ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ ,మండల నాయకులు చెన్నం మోహన్,రేగాఆంద్రయ్య,తదితర లు పాల్గొన్నారు.