అక్రిడిటేషన్ అంగడి సరుకా..?
ఎన్నాళ్ళీ వివక్ష? అక్కరకు రాని అక్రిడిటేషన్
నిజమైన జర్నలిస్టులకు అక్రిడీటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి
బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు
బూర్గు పల్లి కృష్ణ యాదవ్ డిమాండ్
అణగారి పోతున్న జర్నలిస్టుల హక్కులు
హైదరాబాద్ బీసీ భవన్ విద్యానగర్ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గు పల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, సమాజంలో నిత్య సైనికుల్లాగా తన పవిత్రమైన కర్తవ్యం నిర్వహణలో ఉంటూ అలుపెరగకుండా శ్రమించే జర్నలిస్టుల పట్ల నిజామాబాద్ డిపిఆర్ఓ అనుసరిస్తున్న తీరు కలచి వేస్తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు గౌరవంగా అందజేస్తున్న అక్రిడిటేషన్ కార్డులను డబ్బులకు అమ్మడం అనేది సహించరని నేరమని అన్నారు. అభివృద్ధికి బాసటగా నిలుస్తూ రేయింబవళ్ళు పత్రిక రంగంలో వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నిరంతరం పనిచేస్తూ,సమాజ సేవకు అంకితమైన జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టు డి.ఎల్. యన్.చారి గత 25 సంవత్సరాలుగా ఫీల్డ్ లో పనిచేస్తున్నారు.అక్రిడిటేషన్ కార్డు,హెల్త్ కార్డు ఆపడం వలన కుటుంబం రోడ్డుమీదికి వచ్చిందని, గతంలో అతని భార్యకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిన కారణంగా ప్రతిరోజు టాబ్లెట్స్ వాడాల్సిన పరిస్థితి. ఇది తెలుసుకున్న డిపిఆర్ఓ సిబ్బంది మరియు అక్రీడిటేషన్ కమిటీ సభ్యుడు 35 వేల రూపాయలు ఇస్తేనే కార్డు ఇస్తామని, కార్డు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. డబ్బులు ఇవ్వలేదన్న ఒకే ఒకే కారణంతో కాలయాపన చేస్తూ,డి పి ఆర్ ఓ రెండు సంవత్సరాలు, అన్ని అర్హతలు అక్రిడిట్షన్ కార్డు ఆపినారు. జిల్లా కలెక్టర్ కు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?మాది పెద్ద యూనియన్ అని చెప్పుకుంటున్న ఒక యూనియన్ సభ్యుడు 35 వేల రూపాయలు అక్రిడిటేషన్ కార్డు కోసం డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఆఫీసులో అధికారులు చేతివాటం ప్రదర్శించడం బాధాకరం. ఇలాంటి అధికారులు జిల్లాలో కోకోల్లలు డిపిఆర్ఓ సిబ్బంది వింత పొకడ వలన నగరం పేరు మసకబారుతోందని, నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిన జిల్లా అధికారులు,బాధ్యతలు మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న,ప్రజలను పీడించే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.పోలీస్ స్టేషన్లో గోడలకు, దొంగల, రౌడీల ఫోటోలు పెట్టినట్లు ప్రభుత్వ కార్యాలయంలో గోడలపై లంచాలు తీసుకొని దొరికిన అధికారుల ఫోటోలు పెట్టాలని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు జిల్లాలో మరోసారి ఎక్కడ పునరావృతం కాకుండా ఆదేశించి పటిష్టమైన మానిటరింగ్ ఉండాలని స్థానికులు కోరుతున్నారు.