సాంఘిక బహిష్కరణ చేసిన
గౌతొజిగూడ నిందితులను తక్షణమే అరెస్టు చేయండి.
డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 28 ప్రశ్న ఆయుధం :
భారత రాజ్యాంగం ప్రకారం మనుషులందరు సమానమని గౌతోజిగూడ గూడలో డప్పు కొట్టాడాన్ని నిరాకరించిన దళితులను సాంఘిక బహిష్కరణ చెసిన సంఘటన సభ్యసమాజం తలదించుకునె విధంగా వుందని ఈ సంఘటనకు కారణమైన నిందితులందరిని తక్షణమే అరెష్ట్ చేయాలని శనివారం నాడు డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి,జిల్లా అద్యక్షులు దుబాష్ సంజీవ్ ,కార్యదర్శి దయాసాగర్,ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణు లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కి వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కమీషన్ గారికి దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చెసిన గౌతోజిగూడ బాధితులు నర్సమ్మ,చంద్రం, అర్జున్ కుటుంబ సభ్యులను కలిసి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అండగా ఉండాలని,బాధితులకు రక్షణ కల్పించాలని, ఇక సాంఘిక బహిష్కరణ లు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తిసుకునే విదంగా చూడలలని, ప్రధాన నిందితులందరిని తక్షణమే అరెస్టు చేయాలని పొలీసులను అదేశించలని కొరారు. మనుషులందరు సమానమేనని గ్రామస్థులంతా కలిసి మెలసి అన్న దమ్ములుగా జివించె విధంగా ప్రతి నెల చివరన పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి చట్టాల పై అవగహన కల్పించి అంటరానితనం పాటించకుండా ప్రజలకు అవగహన కల్పించాలని అర్డిఓ, డిఎస్పిలను చైర్మన్ అదెశించలని కొరారు.