న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలుశిక్ష..
నిజామాబాద్, జనవరి 17
నగరంలో మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆరో టౌన్ ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 13న అర్సపల్లి వద్ద ఇమ్రాన్ బిన్ సయీద్ మద్యం మత్తులో న్సూసెన్స్ చేయగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మార్నింగ్ కోర్టు మెజిస్ట్రేట్ అతడికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.