Site icon PRASHNA AYUDHAM

మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు.. 4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల

IMG 20250420 WA1709

*మరో వారంలో ఆర్‌ఆర్‌బీ పరీక్షలు.. 4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల*

*హైదరాబాద్‌*

రైల్వే శాఖలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ద్వారా నిర్వహించే పలు పరీక్షల తేదీలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

ఇందులో పారా-మెడికల్ పోస్టులకు నియామక రాత పరీక్ష (సీబీటీ) ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్‌ 28 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ వివరాలను ఆర్‌ఆర్‌బీ తాజాగా వెల్లడించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి.. ఏ సిటీలో పరీక్ష కేంద్రం కేటాయించారో వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసింది.

ఈ ప్రకటన ద్వారా కింద దేశంలోని వివిధ రైల్వే రీజియన్లలో 1376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

Exit mobile version