ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్
అమరావతి :
ఏపీలో వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు.ప్రభుత్వసమాచారం మంతా ఒకే వెబ్సైట్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.