Site icon PRASHNA AYUDHAM

బాన్సువాడలో గ్రూప్ తగాదాలకు చరమగీతం పాడాలి..

IMG 20240725 WA0100

అభివృద్ధికి నడుం బిగించాలి.

పేదల ఇళ్ళ బిల్లులు చెల్లింపు ఇంకెప్పుడు?

కామారెడ్డి ప్రశ్నాయుధం ప్రతినిధి జులై 25

బాన్సువాడ నియోజకవర్గంలోని నేతలు ఇక రాజకీయాలకు, గ్రూపులకు స్వస్తి చెప్పి కలిసికట్టుగా నడుము బిగించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాన్సువాడ నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్రంలోనే విచిత్రంగా ఉన్నాయి. ఇప్పటివరకు పాలకులు ప్రతిపక్ష పార్టీల వారు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ విమర్శలు చేస్తుండేవారు. శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ప్రత్యేకముద్ర వేసుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో ఓటమిపాలైన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించి అధికార పగ్గాలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉంది బాన్సువాడ నియోజకవర్గం నుండి బీ ఆర్ఎస్ పార్టీకి చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పట్టుమని ఆరు నెలలు గడవగానే ప్రతిపక్షంలో ఉండి ఉండకనే మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. శాసనసభ ఎన్నికల నాటి నుండి బాన్సువాడ నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఓటమి పాలైన ఏనుగు రవీందర్ రెడ్డి కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో అన్ని తానై నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యకలాపాల్లో తనదైన పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో గ్రూపు తగాదాలు కొంతవరకు తెరపైకి వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల ముగిసే వరకు బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా కొనసాగింది. కాసుల బాలరాజు వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధిపత్యం పై పోరాటం కొనసాగుతూ వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అధిష్టానం సంతృప్తి చెందినప్పటికీ బాన్సువాడ నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కార్యకర్తలు నేటి వరకు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.ఆనాటి ఆజాతశత్రువులు నేటి మిత్రులు15 ఏళ్ల నుండి బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజు వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మధ్య రాజకీయాలు కొనసాగుతూ వచ్చాయి. మూడు పర్యాయాలు పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కాసుల బాలరాజు ప్రత్యర్థిగా పోటీ చేశారు. రెండు పర్యాయాలు కాసుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు బాన్సువాడ నియోజకవర్గం లో కాసుల బాలరాజుకు కలిసి రాలేదు. అయినప్పటికీ ఆనాటి ఎన్నికలు బాలరాజుకు కాంగ్రెస్ అభిమానులు, కాసుల వర్గీయులు మాత్రం ఆయన వెంట ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ వచ్చారు. శాసనసభ ఎన్నికల్లో కాసులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి టికెట్ సంపాదించారు. అయినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆనాటి నుండి కొన్ని నెలలపాటు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం లో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానేనంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కార్యకర్తల్లో ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని నింపగలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సుమారు 9000 ఓట్లు బాన్సువాడలో మెజార్టీఓట్లు సాధించగలిగారు. శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుండి కాసుల బాలరాజుకు టికెట్ ఇవ్వాల్సి ఉండగా ఆనాటి పరిస్థితులతో అధిష్టానం ఏనుగు రవీందర్ రెడ్డి వైపు మొగ్గుచూపింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కష్ట కాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఆ పార్టీ కష్టాలను పాలుపంచుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో టికెట్లు దక్కకపోయినా ప్రభుత్వంలో ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆశావహులకు నామినేట్ పోస్టులు ప్రభుత్వం కేటాయించింది. కాసుల బాలరాజుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఏనుగు రవీందర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఏనుగు వర్గం ఫిర్యాదు చేసింది. కష్టపడ్డ వారికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయన్న మాదిరిగానే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని రేవంత్ రెడ్డి కట్టబెట్టారు. ఇంతలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం రాజకీయాల్లో ఏనుగు రవీందర్ రెడ్డి స్పీడ్ పెంచి తనదే పై చేయిగా నడిపించారు. ఏనుగు రవీందర్ రెడ్డి కదలికలు కాసుల బాలరాజు వారి వర్గం, మరోపక్క బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఏనుగు తీరును జీర్ణించుకోలేకపోయారు. అజాతశత్రువులు ఇద్దరు ఒకటే తమకున్న శత్రుత్వం పెద్దది ఏమి కాదంటూ మన ఇద్దరికీ అసలు శత్రువు ఏనుగు రవీందర్ రెడ్డి అని, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు జతకట్టారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడంతో పాటు పోచారం స్వగృహానికి ముఖ్యమంత్రి వెళ్లడం వారి కుటుంబ సభ్యులను ఢిల్లీకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలకు పరిచయం చేశారు. పోచారం పార్టీలో చేరిన మరుక్షణమే కాసుల బాలరాజు, పోచారం కుటుంబ సభ్యులు స్నేహానికి సిద్ధమయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే బాన్సువాడలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఉన్నత చేపట్టారు. నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకొని ప్రజల్లో గట్టిపట్టు సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపడం, పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆలోచనలో పడేసింది. శాసనసభ ఎన్నికల వరకు రెండు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బాన్స్వాడలో మూడు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా నడుస్తున్నారు. అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీతో పోరాటం చేయాల్సిన సందర్భంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య ప్రతినిత్యం పోరాటం కొనసాగుతూనే ఉంది. నేతల పోరాటం కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు శాపంగా మారిందని కొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసి మూడు వర్గాలను ఏకం చేసి నియోజకవర్గ అభివృద్ధికి నిధులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయింది. రాబోయే స్థానిక కాంగ్రెస్, బిజెపి పార్టీలు గ్రామాల్లో పోటీ పడనున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులే మూడుగా చీలిపోయి ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నారు. ఇలానే గ్రూపు తగాదాలు కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు అవుతుంది.రాజకీయాలు మానుకొని అభివృద్ధికి నడుం బిగించండితెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆనాటి ప్రభుత్వం ఆనాటి సభాపతి పదకొండు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయించారు. నియోజకవర్గంలోని పేదలందరికీ ఇల్లు కట్టి ఇవ్వడమే తన లక్ష్యంగా ఆనాడు సభాపతి అడుగులు ముందుకు వేశారు. అభివృద్ధిలో బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శప్రాయంగా ఆనాడు నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు నడుస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడా నోచుకోవడం లేదు. ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఎంతో మంది పేదలు నిర్మించుకొని కొంతమంది అప్పుల పాలయ్యారు. మరి కొంతమంది సకాలంలో బిల్లులందుక నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. పేదల కల వేర్చడం ప్రభుత్వ లక్ష్యం సహకారం కావాలంటే ఇళ్ళు నిర్మించుకున్న పేదలకు బిల్లులు చెల్లించాలి. ఇప్పటికే ఏడాది పైగా గడుస్తున్నప్పటికీ పేదలు నిర్మించుకున్న ఇళ్లకు మాత్రం బిల్లుల చెల్లింపు నోచుకోవడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు గ్రూపు తగాదాలకు స్వస్తి చెప్పి అభివృద్ధి బాట పట్టాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. బాన్స్వాడ నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క అభివృద్ధి పని ఇప్పటివరకు మంజూరు కాకపోవడం నాయకుల గ్రూపు తగాదాలే కారణంగా ప్రజలు భావిస్తున్నారు. గ్రామాలే పట్టుకొమ్మలుగా భావిస్తామంటూ నేతలు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు. ఏడాదిగా గ్రామపంచాయతీలకు ఒక్క చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం నుండి సహాయం అందలేదు. గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు ఆరు నెలలుగా జీతాల చెల్లింపు ప్రభుత్వం నిలిపివేసింది. జీతాలు చెల్లించకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికులు పనులు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. నేతలందరూ ఒకటై అభివృద్ధికి నడుం బిగించడంతోపాటు గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లింపుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు పడకేసాయి. ఇంత జరుగుతున్న నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ గ్రూపు తగాదాలకే పరిమితం కావడం పట్ల ప్రజలు మాత్రం తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు….

Exit mobile version