ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర మరమ్మత్తులు ఉంటే ప్రతిపాదనలు పంపాలి

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర మరమ్మత్తులు ఉంటే ప్రతిపాదనలు పంపాలి

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 27, కామారెడ్డి :

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అవసరమైన అత్యవసర మరమ్మత్తులు ఉంటే సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బి.సి.సంక్షేమ అధికారులు, పంచాయతీ రాజ్, ఈ.డబ్లు.ఐ.డి. సి. సంబంధిత ప్రిన్సిపల్స్, వసతి గృహాలు సంక్షేమ అధికారులు, కే.జి.బి.వి. ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలో అత్యవసర మరమ్మత్తులు చేపట్టవలసివస్తే అట్టి పనులకు ప్రతిపాదనలతో నేరుగా తనను కలవాలని అన్నారు. అలాగే త్రాగునీరు సమస్య ఉత్పన్నం అయినపుడు వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా ప్రతిపాదించాలనీ సూచించారు. వసతి గృహాల్లో గాని, పాఠశాలల్లో గాని సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలని, సమస్య పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. ఇట్టి పనులలో నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సి.ఈ. ఓ. చందర్ నాయక్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఈ. డబ్లూ. ఐ.సి. ఇంజనీరింగ్ అధికారులు, ప్రిన్సిపాల్స్ , వసతి గృహాల సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now