●జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 23 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూమెదక్ జిల్లా శివ్వంపేట మండల పోలీస్ స్టేషన్ పరిది గోమారం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన భగత్ సింగ్ అసోసియేషన్ వినాయక నిమజ్జన కార్యక్రమంలో వినాయక నిమజ్జన మండలి వినాయక నిమజ్జన యాత్ర నిర్వహించారు ఈ క్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి నివాస ప్రాంతం వద్ద టపాకాయలు కాల్చగా ఇంట్లో నుండి కొందరు వ్యక్తులు వచ్చి వారిని ఇక్కడ టపాకాయలు కాల్చవద్దు అని అన్నారు భగత్ సింగ్ అసోసియేషన్ వినాయక నిమజ్జన యాత్ర నిర్వహిస్తున్న వ్యక్తులు గొడవపడి దాడి చేసి కొట్టినారాని మణిదీపక్ ధరఖాస్తు ఇవ్వగా దాడి చేసిన వాళ్ల పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తదుపరి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఏవైనా గొడవలు జరిగినప్పుడు సంయమనం పాటించాలని డయల్ 100 కి కానీ దగ్గరలోని పోలీస్ లో సమాచారం అందించాలని జిల్లా పోలీసు ఉన్నత అధికారి, మెదక్ జిల్లా. ఎస్పీ అన్నారు