జమ్మికుంటలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల దండోరా

*జమ్మికుంటలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల దండోరా*

*ఫిబ్రవరి 7న వేయి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శన విజయవంతం చేయాలి*

*IMG 20250117 WA0063

కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)*

*జమ్మికుంట జనవరి 17 ప్రశ్న ఆయుధం*

ఎస్సీ వర్గీకరణ అమలు పరచాలని జమ్మికుంట పట్టణంలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల దండోరా కార్యక్రమం నిర్వహించారు ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనలో మద్దతుగా పాల్గొంటామని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తెలిపారు.

జమ్మికుంట పట్టణంలో జరిగిన కార్యక్రమం డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న నలిగంటి శరత్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ కులానికి అన్యాయం జరగదని జనాభా ప్రాతిపదికన ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు లభించి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఈ పోరాటం న్యాయమైంది కనుకనే సమాజం మొత్తం మద్దతు ఇచ్చిందని కానీ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డు కోవడానికి నేడు బలంగా ప్రయత్నిస్తున్నారని ఆ అడ్డంకులను ఎదుర్కోవడానికి వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో మండే మాదిగల గుండె చప్పుళ్ళును వినిపించడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.మరొక్క సారి అన్ని సామాజిక వర్గాలలో ఉన్న కళా నేతలంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని కోరారు.ఫిబ్రవరి 7 న జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.ఈ సందర్భంగా కళా నేతలు మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టే మొదటి నుండి ఎమ్మార్పీఎస్ కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఎంతటి బలమైన పాత్రని కళానేతలు పోషించారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని విజయానికి చేర్చడానికి కూడా అదే పాత్రను పోషిస్తామని అన్నారు.ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరొక్కసారి గజ్జె కట్టి గళం విప్పి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం నూతన పాటలను రూపొందించి ప్రజల్ని మరింత చైతన్యం చేస్తామని అన్నారు.అందులో భాగంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులంతా పాల్గొంటామని తెలిపారు.

Join WhatsApp

Join Now