*మధిరలో నాకు పాము హల్ చల్*
ఆరు అడుగుల నాగు పాముని బంధించి తిరిగి అడివిలోకి ..
పాముల పాలిట దేవుడుగా మారిన స్నేక్ దోర్నాల రామకృష్ణ
పామును అందరూ దేవుడు లాగా కొలుస్తారు కానీ అదే పాము కనబడితే చనిపోయేంతవరకు కొట్టి ప్రాణం తీస్తారు. అదే స్నేక్ క్యాచర్ రామకృష్ణ కంటపడితే మాత్రం దానికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్లే..
వివరాల్లోకి వెళితే మధిర పట్టణం లోని కృష్ణుని ఆలయం వద్ద ఆరడుగుల త్రాచుపాము ఉండగా చుట్టుపక్కల వారు గమనించి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణకు తెలియజేశారు. వెంటనే రామకృష్ణ పామును బంధించి సురక్షితంగా తిరిగి అడవిలోనికి వదిలేశారు జనావాసాల్లోకి తరచూ ఈ మధ్యకాలంలో పాములు వస్తుండడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతుండగా.. ఎటువంటి జాతి పామునైన చిటికెలో బంధించి అడవిలోకి వదిలి వేస్తున్న దోర్నాల రామకృష్ణను పలువురు అభినందించారు.