మడుపల్లి హై స్కూల్ లో విద్యార్థినిలకు crime against women, cyber crimes పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగినది…
మహిళలు,బాలికలు,విద్యార్థినిలు వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 కు ఫిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది.విద్యార్థినిలకు పాఠశాల విద్య చాలా ముఖ్యమైనది .ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్కరి రక్షణ గురించి పోలీస్ యంత్రాంగం పని చేయడం జరుగుతుంది. ఈవిటిజింగ్,గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ క్రైమ్స్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుగ్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగింది .