మెదక్/నర్సాపూర్, జనవరి 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలోని ఎన్ హెచ్-765డి రహదారిపై ప్రమాదకర మూలమలుపు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నర్సాపూర్ పట్టణంలోని ఎన్ జీఓఎస్ కాలనీ వద్ద ఉన్న ఎన్ హెచ్ -765డి జాతీయ రహదారిపై ప్రమాదకర మూలమలుపు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు ఇటీవల సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ లింగంకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన అధికారులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు, రహదారి భద్రత కోసం భారీకేడ్లు (బారికేడ్లు) ఏర్పాటు చేయాలని సూచించారు. సంబంధిత అధికారుల సహకారంతో ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదకర మూలమలుపు వద్ద భారీకేడ్లు, భారీకేడ్లకు రేడియం ఏర్పాటుతో స్థానికులు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక పోలీస్, రహదారి శాఖ అధికారుల సహకారంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. రహదారిపై ప్రయాణించే వారిని రహదారి నియమాలను పాటించాలని, వేగం పరిమితిని అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ లింగం, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సుధీర్ గౌడ్, నాయకులు దావూద్ ఇబ్రహీం, ఎన్ఎస్ యూఐ మెదక్ జిల్లా అధ్యక్షుడు హరీష్ వర్ధన్ ముదిరాజ్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ లో ప్రమాదాల నివారణకు భారీకేడ్లు, రేడియం ఏర్పాటు
Published On: January 20, 2025 8:13 pm
