నిజామాబాద్ లో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష

*నిజామాబాద్ లో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష*

IMG 20250325 WA0091 scaled

100మంది భక్తులు, 4 భజన మండలీలు పాల్గొన్నారు.*

*రామకోటి రామరాజు కృషికి సన్మానించిన భక్త బృదాలు*

*భద్రాచల రామయ్యకు భక్తితో గోటి తలంబ్రాలు అందజేశారు*

*ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు*

శ్రీరామనవమి నాడు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కల్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ, గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. అందులో భాగంగా మంగళవారం నాడు నిజామాబాద్ లోని కొటగల్లిలో గల జైర్ కోట్ హనుమాన్ మందిరంలో వందకు పైగా భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు. వారిచే రామనామ స్మరణ చేయించి రామనామం గురించి, భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ జెలియజేశారు.

మైసమ్మ భజన మండలి, జైర్ కోట్ భజన మండలి, మల్లికార్జున భజన మండలి, విజయగణపతి భజన మండలి పాల్గొని 4గంటల పాటు భజనను ఆలపించారు.

ఈ సందర్బంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవకు భక్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులుమాట్లాడుతూ మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా మేము చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now