Site icon PRASHNA AYUDHAM

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి: టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్

IMG 20251011 164458

Oplus_131072

సంగారెడ్డి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇన్ సర్వీస్ లోని ఉపాధ్యాయులకు టెట్ నుండి పూర్తిగా మినాయింపు ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ అన్నారు. శనివారం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణకు ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో తప్పని సరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుండి రిటైర్డ్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన ఇచ్చిన తీర్పు ద్వారా దేశ వ్యాప్తంగా 25 లక్షల మంది టీచర్లపై ప్రభావం చూపుతోందని తెలిపారు. 25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీర్పును పునః సమీక్షించాలని కోరారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి ఉపాధ్యాయులకు అండగా నిలవాలని టీటీయూ సంగారెడ్డి జిల్లా పక్షాన కోరుతున్నామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్ మాట్లాడుతూ.. ఆగస్టు 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ ను తప్పనిసరి చేస్తూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23లో స్పష్టత ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని, గత 15 సంవత్సరాలుగా ఎన్సీటీఈ మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టం 2009 అమలుకు పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ అవసరమని చెప్పలేదని పైగా 2010కి ముందు నియామకమైన వారికి టెట్టు మీనాయింపు ఇచ్చినట్లు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించారని, అందుకే సీనియర్ టీచర్లు ఇప్పటి వరకు టెట్ పాస్ కావాలనే ఆలోచన చేయలేదని అన్నారు. జిల్లా ముఖ్య సలహాదారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోని ఉపాధ్యాయులందరికీ ఆందోళన కలిగించే విధంగా ఉన్నందున సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత పరీక్ష నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని టీటీయూ తెలంగాణ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా పక్షాన కోరుతున్నామన్నారు. సహధ్యక్షుడు శంకర్, బట్టు నర్సింహారాజు మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సౌజన్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించాలని, పెండింగ్ డిఏలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు రాములు, కోటేశ్వర్, మహిళా కార్యదర్శి సుమాలిని తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version