శాంతాపూర్ లో పనుల జాతరకు శ్రీకారం
ప్రశ్న ఆయుధం 23 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి)
బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి ఉపాధి కల్పన పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని అభివృద్ధి పథకాలు అందరు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రుషేగాం భూమయ్య మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి,ఉప సర్పంచ్ రఫీక్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ గ్రామ క్షేత్ర సహాయకుడు అంజయ్య మారుతి,నర్సింలు,జనార్దనరెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.