సింగరేణిలో అధికారుల ఇష్టారాజ్యం..! సీటు వదిలేదే లే…?

సింగరేణిలో అధికారుల ఇష్టారాజ్యం..!

సీటు వదిలేదే లే…

ఏళ్లకు ఏళ్లుగా ఏరియా లోనే తిష్ట

కీలక పోస్టులను వదలని పలువురు

ఏడెనిమిదేళ్లకుపైగా ఒకే చోట ఉద్యోగాలు

బదిలీ జరిగిన కదలరు.. సీటు వదలరు

ఏరియాలోనే అతుక్కుపోతారా..?

యూనియన్, రాజకీయ పార్టీల నేతలతో చెట్టాపట్టాల్‌

సి అండ్ ఎండి సాబ్.. జర దృష్టి సారించండి సార్

సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి

మణుగూరు : సింగరేణి సంస్థలో కొందరు అధికారులు సంస్థ నిబంధనలకు విరుద్దంగా ఏళ్ల తరబడి ఏరియాలో ఒకటే చోట ఉద్యోగం చేస్తూ అనేక అవినీతి, అక్ర మాలకు పాల్పడుతున్నారని,

సీటు వదిలేదే లే…బదిలీ జరిగిన కదిలేది లే అంటూ సింగరేణి ఉన్నత అధికారులకే సవాలు విసురుతు ఏళ్లకు ఏళ్లుగా ఏరియా లోనే తిష్ట వేసి కొలువులు చేస్తున్నారని వీరిపై సంస్థ ఉన్నత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వెంటనే బదిలీ ప్రక్రియ చేపట్టాలని,సామాజిక కార్యకర్త , న్యాయవాది కర్నె రవి డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సంస్థలో కొందరు అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోందన్నారు

. ఏళ్లతరబడి ఒకటే చోట తిష్ట

వేసిన కొందరు అధి కారులు గనులపై తాము ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారని,యూనియన్, రాజకీయ పార్టీల నేతలతో చెట్టా

పట్టాలతో తాము అధికారుల మన సంగతి మరిచిపోతున్నారని,తమ అనుయాయులకు స్థానికంగా పనులను, ఉపాధి ఉద్యోగాలను ఇచ్చేందుకు పోటీ పడుతున్నార

న్నారు. ఇందుకుగాను పెద్ద మొత్తం

లో డబ్బులు, ఇతర నజరానాలు అందుకుంటున్నట్లు బాహాటంగా ప్రచా రం జరుగుతోందన్నారు. సింగరేణిలో ఉన్నత అధికారులను మచ్చిక చేసుకొని కొందరు అధికా

రులు ఏరియాలో చక్రం తిప్పుతూ కీలక పోస్టుల బాధ్యతలతో పైరవీ లతో అవినీతికి ఆజ్యం పోస్తూ ఇష్టారీతిన వ్య వహరిస్తున్నారని రవి ఆరోపించారు. కొందరు లాంగ్‌ స్టాండింగ్‌ అధికారుల అవినీతి కారణంగా సంస్థ అబాసు పాల య్యే పరిస్థితులు నెలకొన్నాయ

న్నారు. కొం దరు అధికారులు ఏళ్లకు ఏళ్లుగా ఏరియాలో పని

చేస్తూ సింగరేణి హెడ్‌ ఆఫీస్‌లో పై అధికా రులతో సత్సంబంధాలు పెట్టుకుని తమకు బదిలీలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్థానికంగా గను లపై అధికారాలు చలాయిస్తున్నారని,సదరు అధికారులను ఆశ్ర యిస్తేచాలు అప్పటికప్పుడే ఎలాంటి పని అయినా క్షణాల్లోనే అయిపోతుం

దని, అలా అవినీతి అధి కారుల అండదండలతో అర్హతలేని వారు ఎందరో స్థానిక ఓబీ కంపెనీల

తోపాటు ఎస్ఎంఎస్ ప్లాంట్ లలో ఉపాధి పొందారన్నారు. స్థానిక భూ నిర్వాసిత యువతకు ఉపాధి కల్పించడంలో శ్రద్ధ చూపని ఆ అధికారులు నజరానా సమర్పించే వారికి ఉపాధి కల్పిస్తున్నారని, ఆయన ధ్వజమెత్తారు.డివిజన్‌కు చెందిన ఓ అధికారి, ఉద్యోగ సంఘాల నేతగా పేరున్న మరో అధికారి స్థానికంగా పదేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నార

ని, కార్మికులకు కేటాయించాల్సిన క్వార్టర్స్ పై కూడా తమ అజమా

యిషిని చూపిస్తూ కార్మికులకు కాకుండా కొందరు విలేకరులకు సింగరేణి క్వార్టర్స్ ను కేటాయిస్తూ, వారి బంధువులకు, వారు సూచిం

చిన వారికి స్థానిక ఎస్ఎంఎస్ ప్లాంట్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల

ను ఇప్పించి వారి మన్ననలను పొందుతు భూ నిర్వాసిత తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శిం

చారు.అ లాగే ఇదే డివిజన్‌లోని ఓ మేనేజర్‌ కూడా ఏదో ఒక నజరా

నా ఇస్తే పనులు చక్కబెడతారన్న

విమర్శలు ఉన్నాయని,మెడికల్ అండ్ ఫిట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యుల మధ్య మన

స్పర్ధలు ఉంటే వాటిని ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకోవడం పరిపాటిగా మారిందన్నారు.ఇలా అక్రమ మార్గంలో పనులు చక్కబె డుతున్న అధికారులు ఒక్కో పనికి నగ దు, ఇతర నజరానాలు అందు

కుంటున్నట్లు కార్మిక వర్గాలలోనే చర్చ సాగుతుందన్నారు. మరో

వైపు ఏరియాలో కొందరు అధి

కారులు సమాచార హక్కు చట్టం ను తుంగలోకి తొక్కే విధంగా వ్యవహరిస్తున్నారని, సమాచారం కోరితే కనీసం అవగాహన లేకుం

డా సెక్షన్ 8 1 j ప్రకారం వ్యక్తిగతం అని తప్పుడు సమాచారం ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని, రాష్ట్ర సమాచార కమిషనర్ ఎన్ని సార్లు మందలచ్చిన వీరి తీరు మారటం లేదన్నారు. ఇప్పటికైనా సింగరేణి ఉన్నత అధికారులు స్పందించి ఒకేచోట ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న అధికారు

లను బదిలీ చేయాలని, స్థానిక భూ నిర్వాసిత యువతకు ఉపాధి కల్పించాలని, సింగరేణి క్వార్టర్స్ కేటాయింపుల లో అక్రమాలను నిరోధించాలని డిమాండ్ చేశారు

. లేనిచో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం నాయక్ ను స్వయంగా కలిసి ఏరియాలో జరుగుతున్న పరిణామాలను వివరించి ఫిర్యాదు చేస్తామని రవి తెలిపారు…

Join WhatsApp

Join Now