రాష్ట్రాల్లో కులమత విభేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలి
– దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
రాష్ట్రాల్లోని ప్రజలందరూ కుల మతాల విభాగాలు లేకుండా కలిసి జీవించాలని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచాలను సృష్టించిన పెరుమల ప్రణయ్ హత్య కేసులో సోమవారం నల్గొండ జిల్లా కోర్ట్ ఒకరికి ఉరిశిక్ష విధించడం, మిగతా వారికి జీవిత ఖైదీ విధించడం జరిగిందనీ, ఇకనుంచి అయినా రాష్ట్రాల్లో కులమత విభేదాలు లేకుండా అందరూ సమాన హక్కులతో కలిసి పోరాటాలు చేయాలన్నారు. న్యాయంగా తీర్పునిచ్చిన కోర్టుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరీష్, నరసయ్య, కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.