నిర్మలమ్మ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పేదలకు శ్రమజీవుల కు చోటెక్కడ

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పేదలకు శ్రమజీవుల కు చోటెక్కడ

– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు. రైతు. వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025.26 సంవత్సరాల బడ్జెట్ను వ్యతిరేకిస్తూ జిల్లా సెమినార్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ హాజరై, సెమినార్ను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన 2025, 26 సంవత్సరాలకు ప్రవేశపెట్టిన 50 లక్షల 65,346 కోట్లు వార్షిక బడ్జెట్లో లో పేదలకు కార్మిక వర్గానికి ఎలాంటి కేటాయింపులు దక్కలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ల కు దోచిపెట్టే బడ్జెట్ గా ఉందనీ, మధ్యతరగతి ఉద్యోగులను మాయ చేస్తూ తమ ఆదాయంలో పన్ను రాయితీని ప్రకటిస్తూనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 12 లక్షల 75000 దాటిన ఒక్క రూపాయి పెరిగిన నాలుగు లక్షల పన్నును విధించింది ఇది దుర్మార్గం మరోవైపు ఇన్సూరెన్స్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతం స్వాగతిస్తూ ప్రకటన చేయటం దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి, జిఎసి, పోస్టల్ బీమా లాంటి సంస్థలను నీరుగారిస్తూ ప్రైవేటు వ్యక్తుల పరం చేసిందన్నారు. విద్యుత్తును ప్రైవేటీకరిస్తూ భారతదేశ్యానికి తలమానికంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేసిందనీ, సంవత్సరాల తరబడి రైతాంగం వ్యవసాయ దారులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో పంటల గిట్టుబాటుకు సంబంధించిన ప్రకటన చేయకపోవడం తీవ్ర వ్యతిరేకతను కేంద్ర బిజెపి ప్రభుత్వం కూడగట్టుకుందన్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పనికి బడ్జెట్ పెంచాలని పని రోజులు పెంచాలని కోరుతున్నప్పటికీ ఏటేటా బడ్జెట్ చెల్లింపులలో తగ్గిస్తూ రావడం ఈ పథకాన్ని నీరుగార్చడం తప్ప మరొకటి కాదన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల పైగా ఉన్న యువతకు ఉపాధి కల్పన చూపిస్తామని సంవత్సరానికి కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ ఆమెరకు బడ్జెట్లో యువతకు ఉపాధి కల్పించే అంశాల పట్ల గాని నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ బడ్జెట్ యొక్క అసలు స్వరూపాన్ని వ్యక్తపరుస్తున్నదన్నారు. దేశ ఆర్థిక శాఖ సర్వే జాతీయ స్థూల ఆదాయాన్ని మరో పదేళ్ల కాలంలో 8 శాతానికి పెంచకోకుంటే భారతదేశ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నప్పటికీ ఆ పద్ధతిలో జాతీయ స్థూల ఆదాయాన్ని పెంచేందుకు బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం కూడా అడుగు ముందుకు వేయని పరిస్థితి ఉంది, ప్రస్తుతం మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు దేశంలో 19 మంది గా ఉన్న సంపన్నులు నేడు 200 మందికి పెరగడం ఎంతటి కార్పొరేట్ బడా సంస్థలకు కేంద్రం కొమ్ముకాస్తుందో అర్థం చేస్తుంది . దేశంలో బడా కార్పొరేట్ సంస్థల ఆదాయంలో నాలుగు శాతం పన్ను గనుక విధిస్తే దేశ జాతీయ స్థూల ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కార్పొరేట్ల ఆదాయం పై పన్ను విధించేందుకు బిజెపి ప్రభుత్వం ధైర్యం చేస్తున్న పరిస్థితి లేదు, ముఖ్యంగా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందనేది చెబుతున్న తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మందిని కేంద్ర మంత్రులుగా తెలంగాణ రాష్ట్రం అందించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపి ప్రభుత్వం తమ బడ్జెట్లో ఎలాంటి ప్రకటన ప్రకటించిన పరిస్థితి లేదు, ముఖ్యంగా రైల్వే కోచ్ ప్రకటిస్తామని, బయ్యారం ఇనుప కర్మాగార నిర్మాణానికి చర్యలు చేపడతామని అదే విధంగా కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించే విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఇప్పటికే విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి అందించాల్సిన నిధులను అందించకపోవడం, జీఎస్టీ పేరుతో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం తొక్కి పట్టడం వెనక కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం పట్ల మొండిగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదనేది అర్థమవుతుందన్నారు. కాబట్టి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తక్షణమే సమూల మార్పులు చేయాలని ముఖ్యంగా కార్మిక వర్గంపై కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నాలను మానుకోవాలని, ఎనిమిది గంటల పని దినాలను 12 గంటలకు మారుస్తూ చేసే విధానాలను తక్షణమే వెనుక్కు తీసుకోవాలని లేబర్ కోర్టులో అమలుకు సిద్ధమవుతున్న బిజెపి ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోళ్లను వెనుక్కు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాలలో కోటి ఇండ్ల నిర్మాణానికి తక్షణమే పూనుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టాలని దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలని, వలస కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరామ్, సిఐటియు జిల్లా నాయకుడు వెంకట్ గౌడ్, మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు, కార్యదర్శి మహబూబ్, ఉపాధ్యక్షుడు కాట్రియాల ప్రభు, గ్రామపంచాయతీ బాల్ నర్సు, మిషన్ భగీరథ అధ్యక్షుడు అనిల్, ప్రతినిధులు విజయ్, నర్సింలు, భూలక్ష్మి, నర్సింలు, సాయిలు, పురుషోత్తం, లక్ష్మితదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now