*మూడు సంవత్సరాలలోనే అమరావతి నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ*
మూడు సంవత్సరాలలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ సభ సాక్షిగా స్పష్టం చేశారు. ఏసీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా.. రాజధాని అమరావతి విషయంలో సభ్యులు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి పనుల పూర్తికి 64వేల 721 కోట్లతో అంచనాలు వేశామని.. టెండర్లు కొనసాగుతున్నాయని చెప్పారు. 2028కి రైతులకు ఇవ్వాల్సిన లే అవుట్‌లు వేసి ఇస్తామని తెలిపారు. మెయిన్ రోడ్డులు 2 సం.రాల్లో పూర్తి చేస్తామని.. అసెంబ్లీ, హైకోర్టు, ఎల్‌పీఎస్ రోడ్లు, డ్రైన్లు మూడు సం.రాల్లో పూర్తి అవుతాయన్నారు. మొత్తం 73 వర్కులకు రూ.64,721 కోట్లు ఎస్టిమేషన్ వేశామని.. వీటిలో 62 పనులను టెండర్లు అయిపోయాయని చెప్పారు.