Site icon PRASHNA AYUDHAM

సెక్షన్ 10 ప్రకారం గోవాలో ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కటిన చర్యలు

IMG 20250808 WA0920

నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్ వేస్తే టక్కున వచ్చే ఫస్ట్ పేరు గోవా.. గోవాకి మన ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది.

ఇక్కడికి వచ్చే వెళ్లే వారి సంఖ్యా చాల ఎక్కువే, ఏడాది మొత్తం కూడా గోవా టూరిస్టులతో కళకళలాడుతుంటుంది. ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడే వచ్చే వారు ఉన్నారు అంటే గోవాకి ఉన్న క్రేజ్ అర్ధం చేకోవచ్చు. అయితే గోవాకి వచ్చి వెళ్లే సందర్శకుల భద్రతని దృష్టిలో పెట్టుకొని గోవా ప్రభుత్వం ఒక్క కొత్త బిల్ ప్రవేశపెట్టింది.

పర్యాటక ప్రదేశంగా పేరుపొందిన గోవాలో ఇకపై పర్యాటకులకి ఇబ్బందులు కలిగించే వారితోపాటు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందుకు గోవా టూరిస్ట్ ప్లేసెస్ సవరణ బిల్లు 2025 (ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్)ను గోవా రాష్ట్ర సర్కార్ ఆమోదించింది. దీని ప్రకారం ఇకపై గోవాలో పర్యాటక ప్రాంతాల్లో ఎవరైనా న్యూసెన్స్ చేస్తే రూ. 5 వేల నుండి రూ.లక్ష వరకూ జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇవన్నీ కూడా న్యూసెన్స్ కిందికే వస్తాయని కొత్త చట్టంలో పేర్కొంది. సవరించిన సెక్షన్ 10 ప్రకారం గోవాలో ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కనిష్ఠంగా రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో గోవా పర్యాటక ప్రదేశాల్లో ఏజెంట్లు పెరిగిపోయారని అందుకే ఈ బిల్లు ఓ ముందడుగు అని గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం తర్వాత కొత్త చట్టంగా అమలులోకి వస్తుంది.

Exit mobile version