అమరజీవి కళ్లెం వీరారెడ్డి స్మారక భవనం ప్రారంభం

తెలంగాణ సాయుధ పోరాట యోధులు, అమర జీవి కళ్ళెం వీరారెడ్డి స్మారక భవనం ప్రారంభం

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

  • తెలంగాణ సాయుధ పోరాట వీర యోధుడు, అమరజీవి కామ్రేడ్ కళ్లెం వీరారెడ్డి స్మారకార్థం, ప్రజల అవసరాల కోసం పిల్లాయిపల్లి గ్రామంలో నిర్మించిన భవనాన్ని ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు ప్రారంభిస్తున్నారని ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో వీరారెడ్డి స్మారకార్థం నిర్మించి ప్రారంభానికి సిద్ధమైన భవనాన్ని సీనియర్ సిపిఎం నాయకులు గూడూరు అంజిరెడ్డి మరియు స్థానిక నాయకత్వంతో నర్సింహ కలిసి పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ అనేక త్యాగాలకు, పోరాటాలకు సాయుధ పోరాట సమరంలో ప్రజల పక్షాన నిలబడి దొరలకు, జాగిర్దారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా బాంచన్ దోర కాళ్లు మొక్కుతానన్నా బక్క చిక్కిన పేదలతో బంధువులు పట్టించి అసువులు బాసిన అమరవీరుల గడ్డ పిల్లాయిపల్లి అని అన్నారు. కామ్రేడ్ కళ్లెం వీరారెడ్డి ఆనాడు భూమికోసం, భుక్తి కోసం పోరాడుతూనే కులవివక్షకు వ్యతిరేకం కృషి చేస్తూ అందరికీ విద్య కావాలని గ్రామంలో పాఠశాల ప్రారంభించి అందరికీ విద్యనందించిన కలం యోధుడని అన్నారు. తన జీవితాంతం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. వారి జ్ఞాపకార్థం నిర్మించిన భవనం ప్రజలకు, ప్రజా పోరాటాలకు ఒక వేదిక కాబోతుందని అన్నారు. 30 తేదీన కార్యాలయ ప్రారంభోత్సవానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారని తెలియజేశారు. కావున ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కొరినారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి, శాఖ కార్యదర్శి పత్తి బిక్షపతి, సభ్యులు కంజర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now