ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చే గంగపుత్రుల క్యాలండర్ ఆవిష్కరణ

*ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ చే గంగపుత్రుల క్యాలండర్ ఆవిష్కరణ*

ప్రతి కుల బంధువులు తమ జాతి ప్రయోజనాల కోసం సంవత్సరం పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తంగా కాలమానికలు రూపొందిస్తున్నారు. విడుదల కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే బెస్తపల్లి, దుబ్బపల్లి, చందనాపూర్ గ్రామాల శ్రీగంగాదేవి దేవస్థానం, తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గంగపుత్ర గారి చేతుల మీదుగా గురువారం హైదరాబాద్ నగరంలో గంగపుత్ర మత్స్యకారుల కులదైవం శ్రీగంగాదేవి అమ్మవారి నూతన సంవత్సరం “క్యాలెండర్ 2025” శ్రీగంగాదేవి నిత్య దీపారాధన కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ “2025 కాలమానిక” విడుదల కార్యక్రమంలో శ్రీగంగాదేవి నిత్య దీపారాధన కమిటీ సభ్యులు అరిపెల్లి శ్రీనివాస్ గంగపుత్ర, మేడి లక్ష్మణ్ గంగపుత్ర, పాటల రచయిత గాయకుడు తాళ్ళ కొత్తపేట ధర్మాజి సతీష్ గంగపుత్ర, గంగపుత్ర మత్స్యకార సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర భారతీయ మత్స్య కార్మిక సంఘ్ (బి.ఎం.ఎస్) అద్యక్షుడు కొప్పు లక్ష్మీనారాయణ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment