ఐ కె పీ, వి ఒ పి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కళాభారతిలో బుధవారం నిర్వహించిన ఐ కె పీ, వి ఒ పి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ డైరీ ఆవిష్కర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, వి ఒ పి చేసినటువంటి పోరాటాలు ఎన్నో కావున మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ గౌస్ ఖాన్,వివోఏ ఉద్యోగుల సంక్షేమ సంగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మనోజ్ శివరాం నాయక్, జిల్లా మండల కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.