పాల్వంచ పట్టణంలో ఇందిరమ్మ విగ్రహం ఆవిష్కరణ

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో
దమ్మపేట చౌరస్తాలో ఇందిరమ్మ విగ్రహన్ని ఆవిష్కరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడారు. భారతదేశపు కీర్తిని ప్రపంచం నలుమూలలా చాటిచెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ,ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకురాలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఇందిరాగాంధీ దేశానికి అందించిన నిరుపమాన సేవలు నాటితరం నాయకులకే కాదు నేటితరం నాయకులకు సైతం స్ఫూర్తిదాయకం అని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కీర్తించారు. మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. దమ్మపేట సెంటర్ లో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఇందిరా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య ఆవిష్కరణ చేసిన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న అలహాబాద్లోని ఆనంద్ భవన్లో భారత దేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించారన్నారు. ఆమె అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని అని కాగా, లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు. 1964లో ఆమె తండ్రి, భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరణం అనంతరం ఇందిరా గాంధీ రాజ్యసభకు ఎన్నికైందనీ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రిమండలిలో ప్రసారశాఖ మంత్రిగా ఆమె విశిష్ట సేవలు అందించిందన్నారు. ఈక్రమంలో 1966లో మొదటిసారి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి.. దేశ మొదటి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించిందన్నారు. కాగా, నేటి వరకు మరో మహిళ భారతదేశ ప్రధాని పదవిని అధిష్టించకపోవడం ఇందిరా గాంధీ ఇప్పటివరకు తొలి మహిళా ప్రధాని కావడం విశేషం అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని బ్యాంకుల జాతీయకరణ, జమీందారీ వ్యవస్థ రద్దు, గరీబీ హఠావో వంటి గొప్ప పథకాలతో భారతదేశ అత్యున్నత ప్రధానిగా ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ,మండల కాంగ్రెస్ నాయకులతో పాటుగా వివిధ అనుబంధ సంఘ నాయకులు, మహిళా సంఘ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment