*శ్రీ శారద శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పోస్టర్ ఆవిష్కరణ*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 28*
కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లోని పరివార సమేత శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వానం పేరిట రూపొందించిన పోస్టర్లను శనివారం రోజున వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ , దేవాలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అక్టోబర్ మూడు నుండి 12వ తేదీ వరకు దేవాలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నట్టు ఆలయ కమిటీ బాధ్యతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రామ్ శంకర్, సుధాకర్, ఆకుల నరేష్ ఇసపల్లి మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.