కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం
ప్రశ్న ఆయుధం జనవరి 20: కూకట్‌పల్లి ప్రతినిధి
చైర్మన్ తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనల్స్ కార్పొరేషన్ దీపక్ జాన్ ఆశీర్వాదంతో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ పర్యవేక్షణలో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆఫీస్ ప్రారంభోత్సవం చేశారు.క్రిస్టియన్ మైనార్టీ కోఆర్డినేటర్ క్రిష్టఫర్ కి సన్మానించి శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్లో క్రిస్టియన్ కమిటీ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీకి క్రిస్టియన్ మైనార్టీ కి వారధిగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హౌసిటోచర్, జాన్, ఫణీంద్ర కుమార్, కెపిహెచ్బి డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, అర్ ఏ పాల్, మయూరి, పొడుగు అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.